Thu Dec 19 2024 18:27:40 GMT+0000 (Coordinated Universal Time)
నేటి గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా
చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షిస్తుంటాయి. ధరలను పెంచడమో, తగ్గించడమో జరుగుతుంది.
చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షిస్తుంటాయి. ధరలను పెంచడమో, తగ్గించడమో జరుగుతుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను బట్టి పెట్రోలు, డీజిల్ ధరలను కూడా చమురు సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ప్రతి నెల ఫస్ట్ తేదీన ధరలను సమీక్షించడం గత కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్ ధరలపైనే ఎక్కువగా హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి.
చమురు సంస్థలు...
గృహవినియోగానికి వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల జోలికి మాత్రం పోవడం లేదు. ప్రజలు తమ ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలపై చమురు సంస్థలు కొద్దిగా జాలి చూపుతున్నట్లుంది. అదే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం పెంచుతూ వస్తున్నాయి . ఈరోజు గృహ వినియోగదారులు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 966 రూపాయలు. విశాఖపట్నంలో 912 రూపాయలు, విజయవాడలో 927 రూపాయలుగా ఉంది.
Next Story